Saturday 19 March 2016

ఇంకో నిమిషంలో చనిపోయేవారిలో కనిపించే లక్షణాలు...నమ్మలేని జీవిత సత్యాలు

చావు...ఇది వింటే చాలు చాల మందికి చచ్చేంచ భయం. ఎక్కడ చనిపోతామో..ఎలా చనిపోతామో అన్న దిగులు. నిజానికి బ్రతికున్న్న రోజులు రంగు రంగుల బట్టలు కట్టుకుంటాము. ఈ రంగుల ప్రపంచాన్ని ఈ కండ్లతో చూస్తాం. మరి చనిపోయే ముందు ఏం చూస్తాం మరి.

మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పలేము. ఎలా చనిపోతాడో అంతకన్నా చెప్పలేము. అయితే మరికొన్ని క్షణాల్లో చనిపోయే వారిదగ్గర ఉంటే మనకు కొన్ని లక్షణాలు తెలుస్తాయంట. వారు చనిపోతున్నారా లేదా అనేది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని చావు లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి.

1. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.

2. చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి.

3. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది.

4. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.

5. కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది.

6. కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని వినికిడి.

No comments :

Post a Comment