Friday 18 March 2016

ఐ.టి. కంపెనీ ఉద్యోగైన 🕵 రాజేష్ ఆరోగ్యం బాలేదని🗣 పేరుగాంచిన అన్ని ప్రముఖ ఆసుపత్రుల 🏥 చుట్టూ తిరిగాడు! అయినా ఆరోగ్యం కుదుట పడక 😷చాల బాధ పడుతున్నాడు! అతని భార్య ఓ సలహా యిస్తూ "ఎందుకైనా మంచిది మీరొకసారి పశువుల డాక్టర్ని సంప్రదించండి" అన్నది! 
రాజేష్ 😳షాకై "నీకేమైనా పిచ్చా నేను పశువుల డాక్టర్ని కలవడమేంటి?" అని అరిచాడు!
భార్య సున్నితంగా "నాకేం పిచ్చికాదు మీకే ప్రాబ్లమ్!  తెల్లవారకముందే
🐓 కోడిలాగా లేచిపోవటం, కాకిలాగా
🐧సగం స్నానం చేసి
🐒కోతిలాగా చేతికి దొరికిందేదో నోట్లో పెట్టుకుతిని
🐎గుర్రంలా ఆఫీస్ కి పరగులుతీసి
🐮 గాడిద చాకిరీ అంతా చేస్తూ
🐻ఎలుగుబంటిలా అందరిపై రంకెలేసి పని చేస్తూ
రాత్రికి ఇంటికి వచ్చి చికాకుతో 🐕 కుక్కలా మా అందరి పై అరిచి
🐊 ముసలిలా ఆబగా తినేసి, మంచమెక్కి
🐃 గేదెలా నిద్రపోతున్నారుగా! అందుకే పశువుల డాక్టర్ని కన్సల్ట్ చేయమంది!"
రాజేష్ నిశ్రేష్ఠుడు అయి ఆమెనే😖🙃 చూస్తూ కూర్చుండిపోయాడు!
"🐺 ఏమిటీ  గుంటనక్కలా నన్నే చూస్తున్నావ్?" అడిగింది భార్య!
🙄😳😖😙🙃😭🙄😳

No comments :

Post a Comment