Monday 2 May 2016

ఎల్ఐసీలో 700 ఏఏఓ పోస్టులు *విద్యార్హత డిగ్రీ * మార్చిలో ప‌రీక్షలు * ఎంపికైతే రూ.40 వేల వేత‌నండిగ్రీ అర్హత‌తో ఉన్న మేటి ఉద్యోగాల్లో ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏఏవో) చెప్పుకోద‌గ్గది . ఈ పోస్టుకు ఎంపికైతే త‌క్కువ వ‌య‌సులోనే హోదా, ఆక‌ర్షణీయ వేత‌నం రెండూ సొంతమ‌వుతాయి. బ్యాంకు ప‌రీక్షలు ల‌క్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఏఏవో కోసం ప్రయత్నించ‌వ‌చ్చు. ఈ రెండు ప‌రీక్షల సిల‌బ‌స్ దాదాపు ఒక‌టే. రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ విభాగాల్లో రాణించిన‌వాళ్లు ఎంపిక కావ‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయి. గ‌తంతో పోల్చుకుంటే ఈసారి పోస్టుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌రీక్షకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం...మొత్తం పోస్టులు:700విభాగాల‌వారీ:ఎస్సీ-106, ఎస్టీ-53, ఓబీసీ-192, అన్ రిజ‌ర్వ్‌డ్‌-349ఎంపిక విధానం:ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూలో చూపిన ప్రతిభ ద్వారావిద్యార్హత‌:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌వ‌యోప‌రిమితి:డిసెంబ‌రు 1, 2015 నాటికి క‌నిష్ఠంగా 21 ఏళ్లు, గ‌రిష్ఠంగా 30 ఏళ్లు ఉండాలి. అంటే డిసెంబ‌రు 2, 1985 - డిసెంబ‌రు 1, 1994 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.స‌డ‌లింపులు:ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యుడీ(జ‌న‌ర‌ల్‌)కు ప‌దేళ్లు, పీడ‌బ్ల్యుడీ (ఎస్సీ,ఎస్టీ) 15ఏళ్లు, పీడబ్ల్యుడీ(ఓబీసీ) 13 ఏళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉన్నాయి.ద‌రఖాస్తు:ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి ద‌ర‌ఖాస్తు రుసుం:ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీఅభ్యర్థుల‌కు రూ.వంద‌, మిగిలిన అంద‌రికీ రూ.600 చివ‌రి తేదీ:జ‌న‌వ‌రి 5, 2016 హాల్ టికెట్లు:ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఎల్ఐసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీలు:మార్చి 5, 6, 13 ప‌రీక్ష కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్‌లో...చీరాల‌, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుత్తూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. తెలంగాణ‌లో...హైద‌రాబాద్‌, హుజ‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, పెద్దప‌ల్లి, వ‌రంగ‌ల్‌.ప‌రీక్షలో... మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 300 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. అయిదు విభాగాల నుంచి ప్రశ్నలొస్తాయి. అవి..రీజ‌నింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు వీటికి 90 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 90 మార్కులు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, క‌రెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు 60 మార్కులు, కంప్యూట‌ర్ నాలెడ్జ్ టెస్ట్ 30 ప్రశ్నలు 60 మార్కులు. చివ‌రి విభాగం ఇంగ్లిష్‌లో 40 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి మార్కులు కేటాయించ‌లేదు.అంటే ఈ విభాగంలో అర్హత సాధిస్తే స‌రిపోతుంది. అర్హత మార్కుల‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ఈ విభాగంలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. త‌ప్పు స‌మాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప్రతి సెక్షన్‌లోనూ అర్హత మార్కులు సాధించ‌డం త‌ప్పనిస‌రి. ఈ మార్కుల‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ఆయా సెక్షన్ల వారీ ప‌రీక్ష రాసిన అభ్యర్థుల స‌గ‌టు ప్రతిభ ఆధారంగా ఏయే సెక్షన్లో క‌నీసం ఎన్ని మార్కులు రావాలో ఎల్ఐసీ గ‌ణిస్తుంది.ఇంట‌ర్వ్యూ...రాత ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూకు ఆహ్వానిస్తారు. సాధారణంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీల‌కు మూడురెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌కు మౌఖిక‌ప‌రీక్షలు నిర్వహిస్తారు. వీటికి హాజ‌ర‌య్యేవాళ్లకి రెండో త‌ర‌గ‌తి స్లీప‌ర్ రైలు లేదా బ‌స్ చార్జీలు రానూ,పోనూ చెల్లిస్తారు. ఇంట‌ర్వ్యూలోనూ క‌నీస అర్హత మార్కులు సాధించాలి. వీటిని ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. అయితే ఇంటర్వ్యూకి ఎన్ని మార్కులు కేటాయించారో ప్రక‌ట‌న‌లో ఎల్ఐసీ ప్రస్తావించ‌లేదు. బ‌హుశా 50 మార్కులకు ఇంట‌ర్వ్యూ నిర్వహించొచ్చు.తుది ఎంపిక‌...రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా మెరిట్ ప్రాతిప‌దిక‌న ఆయాకేట‌గిరీల‌వారీ నియామ‌కాలు ఉంటాయి. ఎంపికైన‌వారికి వైద్య ప‌రీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏ స‌మ‌స్యా లేక‌పోతే ఆఫ‌ర్ లెట‌ర్ చేతికందుతుంది.ఎంపికైతే...ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల‌కు రూ.17240 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. నెల‌కు రూ.40 వేలు వేత‌న రూపంలో అందుకోవ‌చ్చు. కొత్త వేత‌నస్కేలు అమ‌ల్లోకి వ‌స్తే రూ.50 వేలు, ఆపైన‌ వేత‌నం ఆశించ‌వ‌చ్చు. వీటితోపాటు ప‌లు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తాయి. ఎంపికైన‌వారికి ప్రొబేష‌న్ వ్యవ‌ధి ఏడాది. దీన్ని రెండేళ్లకు పొడిగించ‌వ‌చ్చు. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు నాలుగేళ్లపాటు ఎల్ఐసీలో కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. దీనికోసంఒప్పంద ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మ‌ధ్యలో వైదొల‌గాల‌నుకుంటే రూ.2 ల‌క్షలు చెల్లించాలి.ప్రిప‌రేష‌న్ ఇలా... * అభ్యర్థులు 160 ప్రశ్నల‌కు 120 నిమిషాల్లో స‌మాధానం గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు వ్యవ‌ధి 45 సెక‌న్లు మాత్రమే. రీజ‌నింగ్‌, ఆప్టిట్యూడ్ విభాగాల్లోని ప్రశ్నల‌కు ఈ స‌మ‌యం స‌రిపోదు కాబ‌ట్టి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, క‌రెంట్ అఫైర్స్‌; క‌ంప్యూట‌ర్ నాలెడ్జ్‌ టెస్టువిభాగాలను చాలా త‌క్కువ వ్యవ‌ధిలోనే ముగించాలి. అక్కడ ఆదాచేసుకున్న స‌మ‌యాన్ని రీజ‌నింగ్‌, ఆప్టిట్యూడ్ విభాగాల‌కు కేటాయించాలి. * ప‌రీక్షలో రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల‌కు ఎక్కువ ప్రాధాన్యం క‌ల్పించారు. ఈ విభాగాల్లోని ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు అంటే మొత్తం 300 మార్కుల్లో 180 మార్కులు ఈ విభాగాల నుంచే వ‌స్తాయి. అందువల్లఅభ్యర్థులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వ‌హించాలి. విజ‌యాన్ని నిర్ణయించ‌డంలో కీల‌క‌మైన విభాగాలు ఈ రెండే. అలాగే క‌ష్టమైన ప్రశ్నలు వ‌చ్చే విభాగాలు కూడాఇవే. * డిగ్రీ స్థాయిలో కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుకున్నవాళ్లు కంప్యూట‌ర్ నాలెడ్జ్టెస్టులో ఎక్కువ మార్కులు పొంద‌డానికి అవ‌కాశం ఉంది. కంప్యూట‌ర్‌తో ప‌రిచ‌యం లేనివాళ్లు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లోని ప్రాథ‌మికాంశాల‌ను బాగా చ‌దివితే స‌రిపోతుంది. కంప్యూట‌ర్లో ఉండే ప‌రిక‌రాలు, వాటి ప‌నితీరు, ఎంఎస్ వ‌ర్డ్‌, ఎక్సెల్‌, పీడీఎఫ్‌, ప‌వ‌ర్‌పాయింట్‌, షార్ట్‌క‌ట్ క‌మాండ్స్‌...ఇలా ప్రతి ప్రాథ‌మికాంశంపైనా అవ‌గాహ‌న ఉండాలి. ఇంట‌ర్నెట్ ఉప‌యోగించ‌డం గురించీ ప్రశ్నలొస్తాయి. * జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌లో స్టాక్ జీకే ప్రశ్నలు వ‌స్తాయి. అంటే దేశాలు-రాజ‌ధానులు, క‌రెన్సీ, ప్రధాని/అధ‌్యక్షుడు, పార్లమెంట్ పేరు, ఎత్తైన‌వి, లోతైన‌వి, పెద్దవి, చిన్నవి...ఇలా వివిధ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఏదైనా జీకే బుక్ చ‌దువుకోవాలి. క‌రెంట్ అఫైర్స్ విభాగంలో తాజా అంశాల‌కు సంబంధించి..అవార్డులు- గ్రహీత‌లు, క్రీడ‌ల్లో విజేత‌లు, ఎన్నిక‌లు, స‌భ‌లు, స‌మావేశాలు, భార‌త‌దేశ ప్రగ‌తి, పుస్తకాల ర‌చ‌యిత‌లు, కేంద్రప్రభుత్వ ప‌థ‌కాలు, ప్రధాని ప‌ర్యట‌న‌లు, భార‌త్ వ‌చ్చిన ప్రముఖులు...ఇలా ముఖ్యమైన అంశాల‌ను చ‌దువుకోవాలి. ప‌రీక్ష మార్చిలో నిర్వహిస్తారు కాబ‌ట్టి జులై 2015 నుంచి జ‌రిగిన ముఖ్య సంఘ‌ట‌న‌ల‌పైప్రశ్నలు రావొచ్చు. * ఇంగ్లిష్ విభాగంలో వ్యాక‌ర‌ణం, ప‌ద‌సంప‌ద‌, కాంప్రహెన్సన్‌ల నుంచి ప్రశ్నల‌డుగుతారు. ఇంగ్లిష్‌పై ప‌ట్టున్నవాళ్లు తేలిక‌గానే వీటికి జ‌వాబులు గుర్తించ‌వ‌చ్చు. అర్హత మార్కులు సాధిస్తే స‌రిపోతుంది కాబ‌ట్టి ఈ స‌బ్జెక్టులో సందేహం ఉన్నవాళ్లు కొంచెం సాధ‌న‌చేస్తే సులువుగానే స‌మ‌స్యను అధిగ‌మించ‌వ‌చ్చు. * ప‌రీక్షకు నెల రోజుల ముందు నుంచి బ్యాంకు ప‌రీక్షల పాత ప్రశ్నప‌త్రాలు, గతంలో నిర్వహించిన ఏఏఓ ప్రశ్నప‌త్రాలు, మోడ‌ల్ పేప‌ర్లు సాధ‌న‌చేయాలి. ఇత‌ర ఇన్యూరెన్స్ కంపెనీల ఏవో ప్రశ్నప‌త్రాలు కూడా ప్రిప‌రేష‌న్‌లో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. * రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబ‌ట్టి తెలియ‌ని ప్రశ్నల‌కు జవాబులు గుర్తించ‌క‌పోవ‌డ‌మే మంచిది. * జ‌వాబు గుర్తించ‌డానికి ఎక్కువ స‌మ‌యం అవ‌స‌ర‌మైన ప్రశ్నల జోలికి పోవ‌ద్దు. చివ‌ర్లో స‌మ‌యం ఉంటేనే వీటిని ప్రయ‌త్నించండి. * అన్ని సెక్షన్లలోనూ అర్హత మార్కులు త‌ప్పనిస‌రి కాబ‌ట్టి సందేహం ఉన్న విభాగానికి ఎక్కువ స‌మ‌యం వెచ్చించి చ‌దువుకోవాలి.

ఎల్ఐసీలో 700 ఏఏఓ పోస్టులు

*విద్యార్హత డిగ్రీ
* మార్చిలో ప‌రీక్షలు
* ఎంపికైతే రూ.40 వేల వేత‌నండిగ్రీ అర్హత‌తో ఉన్న మేటి ఉద్యోగాల్లో ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏఏవో) చెప్పుకోద‌గ్గది . ఈ పోస్టుకు ఎంపికైతే త‌క్కువ వ‌య‌సులోనే హోదా, ఆక‌ర్షణీయ వేత‌నం రెండూ సొంతమ‌వుతాయి. బ్యాంకు ప‌రీక్షలు ల‌క్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఏఏవో కోసం ప్రయత్నించ‌వ‌చ్చు. ఈ రెండు ప‌రీక్షల సిల‌బ‌స్ దాదాపు ఒక‌టే. రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ విభాగాల్లో రాణించిన‌వాళ్లు ఎంపిక కావ‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయి. గ‌తంతో పోల్చుకుంటే ఈసారి పోస్టుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌రీక్షకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం...మొత్తం పోస్టులు:700విభాగాల‌వారీ:ఎస్సీ-106, ఎస్టీ-53, ఓబీసీ-192, అన్ రిజ‌ర్వ్‌డ్‌-349ఎంపిక విధానం:ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూలో చూపిన ప్రతిభ ద్వారావిద్యార్హత‌:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌వ‌యోప‌రిమితి:డిసెంబ‌రు 1, 2015 నాటికి క‌నిష్ఠంగా 21 ఏళ్లు, గ‌రిష్ఠంగా 30 ఏళ్లు ఉండాలి. అంటే డిసెంబ‌రు 2, 1985 - డిసెంబ‌రు 1, 1994 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.స‌డ‌లింపులు:ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యుడీ(జ‌న‌ర‌ల్‌)కు ప‌దేళ్లు, పీడ‌బ్ల్యుడీ (ఎస్సీ,ఎస్టీ) 15ఏళ్లు, పీడబ్ల్యుడీ(ఓబీసీ) 13 ఏళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉన్నాయి.ద‌రఖాస్తు:ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు రుసుం:ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీఅభ్యర్థుల‌కు రూ.వంద‌, మిగిలిన అంద‌రికీ రూ.600

చివ‌రి తేదీ:జ‌న‌వ‌రి 5, 2016

హాల్ టికెట్లు:ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఎల్ఐసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీలు:మార్చి 5, 6, 13

ప‌రీక్ష కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్‌లో...చీరాల‌, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుత్తూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. తెలంగాణ‌లో...హైద‌రాబాద్‌, హుజ‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, పెద్దప‌ల్లి, వ‌రంగ‌ల్‌.ప‌రీక్షలో...

మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 300 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. అయిదు విభాగాల నుంచి ప్రశ్నలొస్తాయి. అవి..రీజ‌నింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు వీటికి 90 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 90 మార్కులు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, క‌రెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు 60 మార్కులు, కంప్యూట‌ర్ నాలెడ్జ్ టెస్ట్ 30 ప్రశ్నలు 60 మార్కులు. చివ‌రి విభాగం ఇంగ్లిష్‌లో 40 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి మార్కులు కేటాయించ‌లేదు.అంటే ఈ విభాగంలో అర్హత సాధిస్తే స‌రిపోతుంది. అర్హత మార్కుల‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ఈ విభాగంలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. త‌ప్పు స‌మాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప్రతి సెక్షన్‌లోనూ అర్హత మార్కులు సాధించ‌డం త‌ప్పనిస‌రి. ఈ మార్కుల‌ను ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. ఆయా సెక్షన్ల వారీ ప‌రీక్ష రాసిన అభ్యర్థుల స‌గ‌టు ప్రతిభ ఆధారంగా ఏయే సెక్షన్లో క‌నీసం ఎన్ని మార్కులు రావాలో ఎల్ఐసీ గ‌ణిస్తుంది.ఇంట‌ర్వ్యూ...రాత ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూకు ఆహ్వానిస్తారు. సాధారణంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీల‌కు మూడురెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌కు మౌఖిక‌ప‌రీక్షలు నిర్వహిస్తారు. వీటికి హాజ‌ర‌య్యేవాళ్లకి రెండో త‌ర‌గ‌తి స్లీప‌ర్ రైలు లేదా బ‌స్ చార్జీలు రానూ,పోనూ చెల్లిస్తారు. ఇంట‌ర్వ్యూలోనూ క‌నీస అర్హత మార్కులు సాధించాలి. వీటిని ఎల్ఐసీ నిర్ణయిస్తుంది. అయితే ఇంటర్వ్యూకి ఎన్ని మార్కులు కేటాయించారో ప్రక‌ట‌న‌లో ఎల్ఐసీ ప్రస్తావించ‌లేదు. బ‌హుశా 50 మార్కులకు ఇంట‌ర్వ్యూ నిర్వహించొచ్చు.తుది ఎంపిక‌...రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా మెరిట్ ప్రాతిప‌దిక‌న ఆయాకేట‌గిరీల‌వారీ నియామ‌కాలు ఉంటాయి. ఎంపికైన‌వారికి వైద్య ప‌రీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏ స‌మ‌స్యా లేక‌పోతే ఆఫ‌ర్ లెట‌ర్ చేతికందుతుంది.ఎంపికైతే...ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల‌కు రూ.17240 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. నెల‌కు రూ.40 వేలు వేత‌న రూపంలో అందుకోవ‌చ్చు. కొత్త వేత‌నస్కేలు అమ‌ల్లోకి వ‌స్తే రూ.50 వేలు, ఆపైన‌ వేత‌నం ఆశించ‌వ‌చ్చు. వీటితోపాటు ప‌లు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తాయి. ఎంపికైన‌వారికి ప్రొబేష‌న్ వ్యవ‌ధి ఏడాది. దీన్ని రెండేళ్లకు పొడిగించ‌వ‌చ్చు. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు నాలుగేళ్లపాటు ఎల్ఐసీలో కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. దీనికోసంఒప్పంద ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మ‌ధ్యలో వైదొల‌గాల‌నుకుంటే రూ.2 ల‌క్షలు చెల్లించాలి.ప్రిప‌రేష‌న్ ఇలా...

* అభ్యర్థులు 160 ప్రశ్నల‌కు 120 నిమిషాల్లో స‌మాధానం గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు వ్యవ‌ధి 45 సెక‌న్లు మాత్రమే. రీజ‌నింగ్‌, ఆప్టిట్యూడ్ విభాగాల్లోని ప్రశ్నల‌కు ఈ స‌మ‌యం స‌రిపోదు కాబ‌ట్టి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, క‌రెంట్ అఫైర్స్‌; క‌ంప్యూట‌ర్ నాలెడ్జ్‌ టెస్టువిభాగాలను చాలా త‌క్కువ వ్యవ‌ధిలోనే ముగించాలి. అక్కడ ఆదాచేసుకున్న స‌మ‌యాన్ని రీజ‌నింగ్‌, ఆప్టిట్యూడ్ విభాగాల‌కు కేటాయించాలి.

* ప‌రీక్షలో రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల‌కు ఎక్కువ ప్రాధాన్యం క‌ల్పించారు. ఈ విభాగాల్లోని ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు అంటే మొత్తం 300 మార్కుల్లో 180 మార్కులు ఈ విభాగాల నుంచే వ‌స్తాయి. అందువల్లఅభ్యర్థులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వ‌హించాలి. విజ‌యాన్ని నిర్ణయించ‌డంలో కీల‌క‌మైన విభాగాలు ఈ రెండే. అలాగే క‌ష్టమైన ప్రశ్నలు వ‌చ్చే విభాగాలు కూడాఇవే.

* డిగ్రీ స్థాయిలో కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుకున్నవాళ్లు కంప్యూట‌ర్ నాలెడ్జ్టెస్టులో ఎక్కువ మార్కులు పొంద‌డానికి అవ‌కాశం ఉంది. కంప్యూట‌ర్‌తో ప‌రిచ‌యం లేనివాళ్లు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లోని ప్రాథ‌మికాంశాల‌ను బాగా చ‌దివితే స‌రిపోతుంది. కంప్యూట‌ర్లో ఉండే ప‌రిక‌రాలు, వాటి ప‌నితీరు, ఎంఎస్ వ‌ర్డ్‌, ఎక్సెల్‌, పీడీఎఫ్‌, ప‌వ‌ర్‌పాయింట్‌, షార్ట్‌క‌ట్ క‌మాండ్స్‌...ఇలా ప్రతి ప్రాథ‌మికాంశంపైనా అవ‌గాహ‌న ఉండాలి. ఇంట‌ర్నెట్ ఉప‌యోగించ‌డం గురించీ ప్రశ్నలొస్తాయి.

* జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌లో స్టాక్ జీకే ప్రశ్నలు వ‌స్తాయి. అంటే దేశాలు-రాజ‌ధానులు, క‌రెన్సీ, ప్రధాని/అధ‌్యక్షుడు, పార్లమెంట్ పేరు, ఎత్తైన‌వి, లోతైన‌వి, పెద్దవి, చిన్నవి...ఇలా వివిధ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఏదైనా జీకే బుక్ చ‌దువుకోవాలి. క‌రెంట్ అఫైర్స్ విభాగంలో తాజా అంశాల‌కు సంబంధించి..అవార్డులు- గ్రహీత‌లు, క్రీడ‌ల్లో విజేత‌లు, ఎన్నిక‌లు, స‌భ‌లు, స‌మావేశాలు, భార‌త‌దేశ ప్రగ‌తి, పుస్తకాల ర‌చ‌యిత‌లు, కేంద్రప్రభుత్వ ప‌థ‌కాలు, ప్రధాని ప‌ర్యట‌న‌లు, భార‌త్ వ‌చ్చిన ప్రముఖులు...ఇలా ముఖ్యమైన అంశాల‌ను చ‌దువుకోవాలి. ప‌రీక్ష మార్చిలో నిర్వహిస్తారు కాబ‌ట్టి జులై 2015 నుంచి జ‌రిగిన ముఖ్య సంఘ‌ట‌న‌ల‌పైప్రశ్నలు రావొచ్చు.

* ఇంగ్లిష్ విభాగంలో వ్యాక‌ర‌ణం, ప‌ద‌సంప‌ద‌, కాంప్రహెన్సన్‌ల నుంచి ప్రశ్నల‌డుగుతారు. ఇంగ్లిష్‌పై ప‌ట్టున్నవాళ్లు తేలిక‌గానే వీటికి జ‌వాబులు గుర్తించ‌వ‌చ్చు. అర్హత మార్కులు సాధిస్తే స‌రిపోతుంది కాబ‌ట్టి ఈ స‌బ్జెక్టులో సందేహం ఉన్నవాళ్లు కొంచెం సాధ‌న‌చేస్తే సులువుగానే స‌మ‌స్యను అధిగ‌మించ‌వ‌చ్చు.

* ప‌రీక్షకు నెల రోజుల ముందు నుంచి బ్యాంకు ప‌రీక్షల పాత ప్రశ్నప‌త్రాలు, గతంలో నిర్వహించిన ఏఏఓ ప్రశ్నప‌త్రాలు, మోడ‌ల్ పేప‌ర్లు సాధ‌న‌చేయాలి. ఇత‌ర ఇన్యూరెన్స్ కంపెనీల ఏవో ప్రశ్నప‌త్రాలు కూడా ప్రిప‌రేష‌న్‌లో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

* రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబ‌ట్టి తెలియ‌ని ప్రశ్నల‌కు జవాబులు గుర్తించ‌క‌పోవ‌డ‌మే మంచిది.

* జ‌వాబు గుర్తించ‌డానికి ఎక్కువ స‌మ‌యం అవ‌స‌ర‌మైన ప్రశ్నల జోలికి పోవ‌ద్దు. చివ‌ర్లో స‌మ‌యం ఉంటేనే వీటిని ప్రయ‌త్నించండి.

* అన్ని సెక్షన్లలోనూ అర్హత మార్కులు త‌ప్పనిస‌రి కాబ‌ట్టి సందేహం ఉన్న విభాగానికి ఎక్కువ స‌మ‌యం వెచ్చించి చ‌దువుకోవాలి.

No comments :

Post a Comment