Monday 2 May 2016

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 కొబ్బరి చెట్టు నవ్వింది😃 కర్ణాటకలోని ఓ కుటుంబానికి ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది! ఉడుపి జిల్లాలోని వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఓ సాయంత్రం ఆ చెట్టు నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు వినిపించాయి. దాంతో, ఆశ్చర్యపోయిన ఆ కుటుంబ సభ్యులు కొబ్బరి చెట్టు వద్ద ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అక్కడెవరూ కనిపించలేదు. కాసేపటి తర్వాత పిల్లవాడి నవ్వు ఆగిపోయింది. మళ్లీ నవ్వులు వినపడడంతో ఈసారి ఆశ్చర్యం స్థానంలో భయం కలిగింది గోవింద కుటుంబ సభ్యుల్లో. దాంతో, గోవింద ఓ జ్యోతిష్యుడిని కలిసి విషయం వివరించాడు. ఆ జ్యోతిష్యోత్తముడు సదరు కొబ్బరి చెట్టుపై దుష్టశక్తులు చేరి ఉంటాయని, హోమం చేస్తే అవి పారిపోతాయని చెప్పాడు. ఆయన మాట విని హోమం చేసినా ఫలితం శూన్యం! అదే రోజు సాయంత్రం మళ్లీ పిల్లవాడి నవ్వులు వినిపించాయి. ఈ విచిత్ర చెట్టు గురించి వూరంతా పాకింది. జనాలు తండోపతండాలుగా ఈ చెట్టు దర్సనానికి రావటం మొదలుపెట్టారు. ఈ రకమైన విచిత్రమైన పరిస్థితిలో గోవింద కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతుండగా... ఓ కొబ్బరికాయలు కోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. ఆతను చెప్పినది విని, ఆ నవ్వులకి కారణమేంటో ఆ వ్యక్తి నోట విన్న గోవింద కుటుంబ సభ్యుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. భయం ఎగిరిపోయింది. కానీ వూరందరిముందు సిగ్గుతో తలమునకలయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ కొబ్బరి కాయలు కోసే సమయంలో తన సెల్ ఫోన్ ను ఎక్కడో పెట్టీ మర్చిపోయాడు. తన ఫోన్ ను ఎక్కడ మర్చిపోయాడో గుర్తురాక వేరే ఫోన్ నుంచి తన ఫోన్ నెంబర్ కు అప్పుడప్పుడు కాల్ చేస్తుండేవాడు. . కొబ్బరి చెట్టు ఎందుకలా అప్పుడప్పుడు నవ్వుతుందో తెలియక, పాపం, గోవిందయ్య కుటుంబ సభ్యులు హడలిచచ్చేవారు! ఆ వ్యక్తి తన ఫోన్ కు కాల్ చేసినప్పుడల్లా గోవింద కుటుంబానికి నవ్వులు వినిపించేవి. ఎందుకంటే, చిన్న పిల్లవాడి నవ్వులే అతడి ఫోన్ కు రింగ్ టోన్. ఫన్నీ రింగ్ టోన్స్ 🌴😃🌴😃🌴😃🌴😃🌴 💟 JOY OF SHARING 💟

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

కొబ్బరి చెట్టు నవ్వింది😃

కర్ణాటకలోని ఓ కుటుంబానికి ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది!

ఉడుపి జిల్లాలోని వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో ఓ కొబ్బరి చెట్టు ఉంది.

ఓ సాయంత్రం ఆ చెట్టు నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు వినిపించాయి.
దాంతో, ఆశ్చర్యపోయిన ఆ కుటుంబ సభ్యులు కొబ్బరి చెట్టు వద్ద ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అక్కడెవరూ కనిపించలేదు.

కాసేపటి తర్వాత పిల్లవాడి నవ్వు ఆగిపోయింది.

మళ్లీ నవ్వులు వినపడడంతో ఈసారి ఆశ్చర్యం స్థానంలో భయం కలిగింది గోవింద కుటుంబ సభ్యుల్లో.

దాంతో, గోవింద ఓ జ్యోతిష్యుడిని కలిసి విషయం వివరించాడు.
ఆ జ్యోతిష్యోత్తముడు సదరు కొబ్బరి చెట్టుపై దుష్టశక్తులు చేరి ఉంటాయని,
హోమం చేస్తే అవి పారిపోతాయని చెప్పాడు.
ఆయన మాట విని హోమం చేసినా ఫలితం శూన్యం!

అదే రోజు సాయంత్రం మళ్లీ పిల్లవాడి నవ్వులు వినిపించాయి.

ఈ విచిత్ర చెట్టు గురించి వూరంతా పాకింది.
జనాలు తండోపతండాలుగా ఈ చెట్టు దర్సనానికి రావటం మొదలుపెట్టారు.

ఈ రకమైన విచిత్రమైన పరిస్థితిలో గోవింద కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతుండగా...
ఓ కొబ్బరికాయలు కోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు.
ఆతను చెప్పినది విని, ఆ నవ్వులకి కారణమేంటో ఆ వ్యక్తి నోట విన్న గోవింద కుటుంబ సభ్యుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి.
భయం ఎగిరిపోయింది.
కానీ వూరందరిముందు సిగ్గుతో తలమునకలయ్యారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఆ కొబ్బరి కాయలు కోసే సమయంలో తన సెల్ ఫోన్ ను ఎక్కడో పెట్టీ మర్చిపోయాడు. తన ఫోన్ ను ఎక్కడ మర్చిపోయాడో గుర్తురాక వేరే ఫోన్ నుంచి తన ఫోన్ నెంబర్ కు అప్పుడప్పుడు కాల్ చేస్తుండేవాడు. .
కొబ్బరి చెట్టు ఎందుకలా అప్పుడప్పుడు నవ్వుతుందో తెలియక, పాపం, గోవిందయ్య కుటుంబ సభ్యులు హడలిచచ్చేవారు!

ఆ వ్యక్తి తన ఫోన్ కు కాల్ చేసినప్పుడల్లా గోవింద కుటుంబానికి నవ్వులు వినిపించేవి.
ఎందుకంటే, చిన్న పిల్లవాడి నవ్వులే అతడి ఫోన్ కు రింగ్ టోన్.

ఫన్నీ రింగ్ టోన్స్

🌴😃🌴😃🌴😃🌴😃🌴
💟 JOY OF SHARING 💟

No comments :

Post a Comment