Saturday 27 August 2016

పితృదేవోభవ .!!!👲👨 🙏🙏🙏🙏🙏🙏🙏 ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే.. తను చూసుకోలేదు తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞 కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ దాంట్లోనే ఉంటాయని వాడి నమ్మకం.👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది . కరుస్తూ ఉన్నట్టు ఉంది . బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు . లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా … నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲 ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄 కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃 అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜 పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑 ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో… వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓 వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃 సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు . ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో నాన్న లేడు. స్కూటరూ లేదు .😔 అతడికి తెలిసిపోయింది..... నాన్న తన స్కూటర్ తీసుకొని ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని.. అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ ను అక్కడిచ్చి.. తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳 ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪 పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃 వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు, ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు. ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన మోడల్ బైక్ ఏదో చూపించు.. దాని మీద నా కొడుకు హీరో లా ఉండాలి అని చెబుతున్నాడు..👨 వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭 అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨 అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని ”వద్దు నాన్నా ! వద్దు నాన్నా ! నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.." అంటూ ఏడవసాగాడు !😭 ఇంటికి వెళుతూ వెళుతూ… తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬 మీకోసం తన జీతాన్నే కాదు... జీవితాన్నీ దారపోసి.... సర్వస్వాన్నీ సమర్పించిన ఆయన 👨 త్యాగాన్ని గుర్తించండి !🙏 బంధాన్ని గౌరవించండి !!🙏 మనసారా ప్రేమించండి !!!🙏 I LOVE MY DAD..💝

పితృదేవోభవ .!!!👲👨
🙏🙏🙏🙏🙏🙏🙏

ఓ కుర్రాడు 👲
కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤
ఎంత కోపంతో వచ్చాడంటే..
తను చూసుకోలేదు
తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు
వేసుకు వచ్చేశాడని.👞👞

కొడుక్కి ఒక మోటార్ సైకిల్
కొనలేని వాడు కొడుకు ఇంజనీర్
కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁

చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒

ఇంటి నుండి వచ్చేప్పుడు
కోపం కొద్దీ… ఎప్పుడూ
ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు
కొట్టుకోచ్చేశాడు 😉
అమ్మకి కూడా తెలియకుండా
రాసే లెక్కలన్నీ దాంట్లోనే
ఉంటాయని వాడి నమ్మకం.👲

నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .
కరుస్తూ ఉన్నట్టు ఉంది .
బూటు లోపల సాఫ్ట్ గా లేదు .
మడమ నొప్పెడుతోంది .😣
అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .
లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు....
బూటు అడుగున చిన్న కన్నం..👞
కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు
ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶

విచారణ లో వాకబు చేస్తే
తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌

సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …
నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని
పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲

ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜
పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑
ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓

వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃
సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు .
ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో
నాన్న లేడు. స్కూటరూ లేదు .😔
అతడికి తెలిసిపోయింది.....
నాన్న తన స్కూటర్ తీసుకొని
ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న
తన స్కూటర్ ను అక్కడిచ్చి..
తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃

వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,
ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.
ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన
మోడల్ బైక్ ఏదో చూపించు..
దాని మీద నా కొడుకు హీరో లా
ఉండాలి అని చెబుతున్నాడు..👨

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని
”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."
అంటూ ఏడవసాగాడు !😭

ఇంటికి వెళుతూ వెళుతూ…
తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు
ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬

మీకోసం
తన జీతాన్నే కాదు...
జీవితాన్నీ దారపోసి....
సర్వస్వాన్నీ సమర్పించిన
ఆయన 👨
త్యాగాన్ని గుర్తించండి !🙏
బంధాన్ని గౌరవించండి !!🙏
మనసారా ప్రేమించండి !!!🙏

I LOVE MY DAD..💝

No comments :

Post a Comment