Tuesday 16 August 2016

👉అద్భుతమైన కథ: ఒక ఫకీర్ చాలా కాలం పాటు ఒక మహారాజు ఆస్థానంలో ఉండిపోయాడు. మహారాజు ఆ ఫకీర్ పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపేవాడు. ఎంతలా అంటే మహారాజు తనతో సమానంగా ఫకీరుకి త న గదిలోనే అతనికి వసతి ఏర్పాటు చేసాడు. ఫకీర్ హస్తం లేకుండా మహారాజు ఏ కార్యం తలపెట్టేవాడు కాదు. ఎంత చిన్న విషయమైనా ఇద్దరూ కలిసే చేసేవారు. ఒకరోజు ఇద్దరూ వేటకు వెళ్ళారు. వేటలో ఇద్దరూ దారి తప్పిపోయారు. తీవ్రమైన ఆకలి దప్పికలతో ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. ఆ చెట్టు మీద ఒకే ఒక పండు ఉన్నది. మహారాజు వెంటనే గుర్రంపైకెక్కి ఆ పండును తెంపి, ఆరు ముక్కలుగా కోసి అలవాటు ప్రకారం మొదటిముక్కని ఫకీరుకి అందించాడు. ఫకీరు ఆ ముక్క తిన్నవెంటనే -" ఆహా! ఎంత మధురంగా ఉంది. నా జీవితంలో ఇంత రుచికరమైన పండుని తినలేదు,ఇంకో ముక్క కావాలని "అడిగాడు. ఆ విధంగా ఐదు తిన్నాడు. ఎప్పుడైతే మిగిలిన చివరి ముక్కను కూడా అడిగాడో, వెంటనే మహారాజు ఇలా అన్నాడు." నీ వాటాకు మించి ఇచ్చాను, నేను కూడా ఆకలితోనే ఉన్నాను కదా! నాకు నీ మీద ప్రేమ ఉంది కానీ నీకు నా మీదఏ మాత్రం ప్రేమ లేదు." అని ఆ చివరి ముక్కను తనే తీసుకుని నోటిలో పెట్టుకున్న వెంటనే ఊసినాడు. ఆ వెంటనే -" నీవు పిచ్చోడివి, ఇంత పుల్లగా ఉన్నముక్కలెలా తిన్నావ్?" అని అడిగాడు. అప్పుడు ఫకీరు-" ఏ చేతులతోనైతే ఎన్నెన్ని మధుర ఫలాలు తినెందుకు లభించాయో,అలాంటి చేతి నుంచి వచ్చిన ఒక పుల్లటి ఫలం గురించి ఫిర్యాదు ఎలా చేయగలను? అందుకే నీకు రుచి తెలియకూడదనే అన్ని ముక్కలను తీసుకుంటూనే ఉన్నాను !" స్నేహితులారా... ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సందేహానికి తావుండదు. రండి... మనం ఇలాంటి బంధాలనే నిర్మించుకుందాం! కొంత మా నుండి నేర్చుకోండి, కొంత మాకు నేర్పండి! మన ఈ గ్రూప్ ని ఇందుకు వేదికగా చేసుకుందాం! "అదృష్టం"కు ఉన్న సహజ అలవాటు "తప్పనిసరిగా పడిపోవడం(పడగొట్టడం)." పడిపోయినప్పుడు అన్నింటినీ పోగొడుతుంది. అందుకే నీ స్థాయి గొప్పగా ఉన్నప్పుడు అహంకారంతో ఉండకు! కాలం కలసి రానప్పుడు స్థిమితంగా ఉండు!!

👉అద్భుతమైన కథ:

ఒక ఫకీర్ చాలా కాలం పాటు ఒక  మహారాజు ఆస్థానంలో ఉండిపోయాడు. 
మహారాజు ఆ ఫకీర్ పట్ల ఎంతో  ప్రేమాభిమానాలు చూపేవాడు. ఎంతలా అంటే మహారాజు తనతో సమానంగా   ఫకీరుకి త న గదిలోనే అతనికి వసతి ఏర్పాటు చేసాడు.                            ఫకీర్ హస్తం లేకుండా మహారాజు ఏ కార్యం తలపెట్టేవాడు కాదు. ఎంత చిన్న విషయమైనా ఇద్దరూ కలిసే చేసేవారు. 

  ఒకరోజు ఇద్దరూ వేటకు వెళ్ళారు.  వేటలో ఇద్దరూ దారి తప్పిపోయారు. తీవ్రమైన ఆకలి దప్పికలతో ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. ఆ చెట్టు మీద  ఒకే ఒక పండు ఉన్నది. మహారాజు  వెంటనే గుర్రంపైకెక్కి ఆ పండును   తెంపి, ఆరు ముక్కలుగా కోసి అలవాటు ప్రకారం మొదటిముక్కని ఫకీరుకి అందించాడు.                         ఫకీరు  ఆ ముక్క తిన్నవెంటనే -" ఆహా! ఎంత మధురంగా  ఉంది. నా   జీవితంలో ఇంత రుచికరమైన పండుని తినలేదు,ఇంకో  ముక్క కావాలని "అడిగాడు.

ఆ విధంగా ఐదు  తిన్నాడు.
ఎప్పుడైతే మిగిలిన చివరి ముక్కను కూడా అడిగాడో, వెంటనే మహారాజు ఇలా అన్నాడు." నీ వాటాకు మించి ఇచ్చాను, నేను కూడా ఆకలితోనే ఉన్నాను కదా! నాకు నీ మీద ప్రేమ ఉంది కానీ నీకు నా మీదఏ మాత్రం ప్రేమ లేదు." అని ఆ చివరి ముక్కను తనే తీసుకుని నోటిలో పెట్టుకున్న వెంటనే ఊసినాడు.

ఆ వెంటనే -" నీవు పిచ్చోడివి, ఇంత పుల్లగా ఉన్నముక్కలెలా తిన్నావ్?"
అని అడిగాడు.

అప్పుడు ఫకీరు-" ఏ చేతులతోనైతే ఎన్నెన్ని మధుర ఫలాలు తినెందుకు లభించాయో,అలాంటి చేతి నుంచి వచ్చిన ఒక పుల్లటి ఫలం గురించి ఫిర్యాదు ఎలా చేయగలను? అందుకే నీకు రుచి తెలియకూడదనే అన్ని ముక్కలను తీసుకుంటూనే ఉన్నాను !"

స్నేహితులారా... ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సందేహానికి తావుండదు.

రండి... మనం ఇలాంటి బంధాలనే  నిర్మించుకుందాం! కొంత మా నుండి నేర్చుకోండి, కొంత మాకు నేర్పండి!

మన ఈ గ్రూప్ ని ఇందుకు వేదికగా చేసుకుందాం! 

"అదృష్టం"కు ఉన్న సహజ అలవాటు "తప్పనిసరిగా పడిపోవడం(పడగొట్టడం)." పడిపోయినప్పుడు అన్నింటినీ పోగొడుతుంది.
అందుకే నీ స్థాయి గొప్పగా ఉన్నప్పుడు అహంకారంతో ఉండకు!
కాలం కలసి రానప్పుడు స్థిమితంగా ఉండు!!

No comments :

Post a Comment